భారతదేశం, జూన్ 12 -- అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం ఆర్టిస్ట్, వ్యాపారవేత్త జైనాబ్ రవద్జీతో శుక్రవారం (జూన్ 6) హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వీరి రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పలువురు సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఆ రిసెప్షన్ లో అఖిల్ వదిన, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

ఎర్ర చీరలో శోభిత ధూళిపాళ ట్రెడిషనల్ తో పాటు ట్రెండీగానూ కనిపించింది. ఆమె ఫొటోలు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కనిపించాయి. రిసెప్షన్ లో శోభిత, నాగచైతన్య ఫొటోలను అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఓ ఫొటోలో చైతన్య, శోభిత కలిసి పోజులిచ్చారు. రెండో ఫొటోలో కుటుంబమంతా కలిసి చిరునవ్వులు చిందిస్తూ, మధ్యలో నవ వధ...