భారతదేశం, జూలై 19 -- దేశ రాజధాని దిల్లీలో ఒక షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 36ఏళ్ల వ్యక్తి విద్యుదాఘాతంతో ప్రమాదవశాత్తు మరణించాడని వైద్యులు నిర్థరించారు. కానీ మరిదితో ప్రేమలో పడిన ఆ వ్యక్తి భార్యే, అతడిని చంపేసిందని తేలింది!

జులై 13న బాధితుడు కరణ్ దేవ్​ని అతని భార్య సుస్మిత మాతా రూప్రాని మగ్గో హాస్పిటల్‌కు తీసుకువచ్చింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని ఆమె పేర్కొంది. ఆసుపత్రి సిబ్బంది అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఇది ప్రమాదంగా భావించిన అతని కుటుంబం పోస్ట్‌మార్టం లేకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లాలని భావించింది. అయితే, దిల్లీ పోలీసులు బాధితుడి వయస్సు, మరణ పరిస్థితులను ఉటంకిస్తూ పోస్ట్‌మార్టం నిర్వహించాలని పట్టుబట్టారు.

ఆ సమయంలో.. అతని భార్య, అతని బంధువు రాహుల్ అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ, పోలీసులు బాధితుడి మృతదేహాన్ని ...