భారతదేశం, డిసెంబర్ 2 -- టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది అక్టోబర్‌లో అత్యంత సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో తన కాబోయే మరిది ఆనంద్ దేవరకొండకు రష్మిక ఆల్ ద బెస్ట్ చెప్పింది. తాజాగా అతడు నటిస్తున్న కొత్త సినిమా కోసం రష్మిక సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్ రాసింది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'ఎపిక్' (Epic). తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌పై స్పందిస్తూ రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనంద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి జరగనున్న నేపథ్యంలో కాబోయే మరిదికి రష్మిక తెలిపిన మద్దతు నెట్టింట వైరల్ అవుతోంది.

సోమవారం (డిసెంబర్ 1) సాయంత్రం ఆనంద్ దేవరకొండ నటిస...