భారతదేశం, మే 14 -- టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన 'అనగనగా' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా సాగి ఆకట్టుకుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్, విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయాలతో ఈ మూవీ వస్తోంది. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అనగనగా వస్తోంది.

అనగనగా చిత్రం రేపు (మే 14) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలవుతుంది. అంటే ఈటీవి విన్‍లో ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే అడుగుపెట్టనుంది.

అనగనగా చిత్రానికి సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు. బడా కార్పొరేట్ స్కూళ్లలో విద్యావ్యవస్థ ఎలా ఉంటుందనే విషయం ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. కొడుకు చదువుపై ఆందోళన పడే తల్లిదండ్రుల చుట్టూ స్టోరీ సాగుతుంది. ఉపాధ్యాయుడిగా సుమంత్ చ...