భారతదేశం, నవంబర్ 20 -- పాపులర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 శుక్రవారం (నవంబర్ 21) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గత ఆరు సంవత్సరాలుగా 'ది ఫ్యామిలీ మ్యాన్' భారతీయ పాప్ సంస్కృతిలో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సిరీస్ అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటి. ఇప్పుడు సీజన్ 3 స్ట్రీమింగ్ సందర్భంగా క్రియేటర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సిరీస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓ స్పై థ్రిల్లర్. అంతే కాకుండా ఇందులో కామెడీ కూడా ఉంది. అయితే ఈ రెండింటిని మిక్స్ చేస్తే సిరీస్ వర్కౌట్ కాదని ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చెప్పాడని రాజ్ నిడిమోరు వెల్లడించాడు. రాజ్ అండ్ డీకే కలిసి ఈ సిరీస్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఫస్ట్ రెం...