Hyderabad, ఏప్రిల్ 24 -- ఓటీటీలోకి ఎన్నో రకాల జోనర్స్‌తో సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటే మరికొన్ని నెల దాటిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతోన్నాయి.

అలా నెలన్నర తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే నిరమ్ మారుమ్ ఉలగిల్. నలుగురు జీవితాలకు సంబంధించిన ఎమోషనల్, క్రైమ్ డ్రామాతో అంథాలజీ సినిమాగా నిరమ్ మారుమ్ ఉలగిల్ తెరకెక్కింది. ఇది క తమిళ చిత్రం. నిరమ్ మారుమ్ ఉలగిల్ అంటే తెలుగులో 'రంగులు మారుతున్న ప్రపంచం' అని అర్థం వస్తుంది.

టైటిల్‌కి తగినట్లుగానే పరిస్థితులకు అనుగుణంగా సినిమాలోని పాత్రలు మారుతుంటాయి. నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాకు బ్రిట్టో జేబీ కథ,...