భారతదేశం, నవంబర్ 12 -- ఈవారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల్లో తెలుగు కామెడీ ఎంటర్టైనర్ అయిన ఏనుగు తొండం ఘటికాచలం కూడా ఉంది. రవి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

టాలీవుడ్ లో డైరెక్టర్ రవి బాబు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కామెడీతోపాటు థ్రిల్లర్ సినిమాలనూ తీస్తూ వెళ్తున్నాడు. అయితే నాలుగేళ్ల తర్వాత అతడు ఇప్పుడు మళ్లీ ఈ ఏనుగు తొండం ఘటికాచలం మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (నవంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని బుధవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఏనుగు తొండం ఘటికాచలం.. ఎ విన్ ఒరిజినల్ ఫిల్మ్.. రవి బాబు రాసి, డైరెక్ట్ చేసిన మూవీ.. నవంబర్ 13 నుంచి...