భారతదేశం, అక్టోబర్ 30 -- ఓటీటీలోకి ఈవారం ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి మలయాళం సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 31) రాబోతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ చేసిన రికార్డులేవో చూడండి.

కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా ఏడు భాషల్లో శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు ఇలా ఉన్నాయి.

'లోకా ఛాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీ మోహన్‌లాల్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ 'ఎల్2: ఎంపురాన్' సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ. 266.81 కోట్లు) అధిగమించి.. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధి...