భారతదేశం, డిసెంబర్ 17 -- ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమాల్లో అతి పెద్ద హిట్ సాధించిన చిన్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 623 శాతం లాభాలతో దుమ్ము రేపింది. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. గురువారమే (డిసెంబర్ 18) మూవీ ప్రీమియర్ ఉంటుందని ఆ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిన్న సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ థియేటర్ల కంటే ఎక్కువ రన్‌టైమ్ తో రానుండటం కూడా మరో విశేషం. బిగ్గెస్ట్ లవ్ స్టోరీ మీ ఇళ్లకు వస్తోందనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ మూవీ కౌంట్‌డౌన్ మొదలు...