Hyderabad, జూన్ 19 -- కేరళ క్రైమ్ ఫైల్స్.. మలయాళం నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే. రెండేళ్ల కిందట వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తొలి సీజన్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో శుక్రవారం (జూన్ 20) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు తొలి సీజన్ లో ఏం జరిగింది? రెండో సీజన్ లో ఏం జరగబోతోంది అన్నది చూడండి.

కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ జూన్ 23, 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాల్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక వేశ్య హత్య చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్. అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించాడు. సీఐడీ సిరీస్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా కేర‌ళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ సాగుతుంది. చిన్న క్లూ కూడా లేని ఓ మ‌ర్డ‌ర్ కేసును కొంద‌రు పోలీసులు ప‌ట్టుద‌ల‌గా ఆరు రోజుల్ల...