భారతదేశం, జనవరి 21 -- బాలీవుడ్​కు ఎంతో ప్రియమైన జంట ధర్మేంద్ర, హేమా మాలిని. వీరిద్దరూ తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అభిమానులను కట్టిపడేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన 'ఆస్ పాస్' చిత్రంలోని 'దరియా మే ఫేంక్ దో చాబీ' పాటకు డ్యాన్స్ చేసిన అరుదైన వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. అభిమానులకు ఇది అమితానందాన్నిస్తోంది.

ఆర్​జే అనిరుధ్​ ఇటీవల ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో హేమా మాలిని, ధర్మేంద్ర ఒకే రంగు (ఊదా) దుస్తుల్లో, పాటను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదిస్తూ కనిపించారు. ధర్మేంద్ర మరణించడానికి కేవలం నాలుగు నెలల ముందు ఈ వీడియో తీసినట్లు అనిరుధ్​ తెలిపారు. ధర్మేంద్ర నవంబర్ 24, 2025న కన్నుమూశారు. ఈ వీడియోలో కూర్చుని ఉన్న హేమా మాలిని, ధర్మేంద్ర పాటకు కాళ్లను కదిపారు.

తన కెనడా కాన్సర్ట్ పర్యటన కోసం ధర్మేంద్ర ఆశీర్వాదం తీసుకోవడా...