భారతదేశం, ఆగస్టు 9 -- వైఎస్సార్, చంద్రబాబు నాయుడు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మలుపు తిప్పిన నాయకులు అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా చూశాం. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఇలాంటి రాజకీయ నాయకుల కథతో, ఇద్దరు మిత్రులు శత్రులుగా ఎలా మారారన్న కాన్సెప్ట్ తో తీసిన సిరీస్ అని 'మయసభ'కు హైప్ వచ్చింది. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. దీన్ని తీసిన డైరెక్టర్ దేవ కట్టా పేరు ట్రెండింగ్ లో ఉంది. ఈ డైరెక్టర్ తీసిన ఈ సినిమాలు కూడా స్పెషలే.

డైరెక్టర్ గా దేవ కట్టా ప్రయాణం 2005లో 'వెన్నెల' అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తో స్టార్ట్ అయింది. కానీ అతనికి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిన సినిమా 'ప్రస్థానం'. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. సొంత కొడుకు, సవతి కొడుకుకు మధ్య జరిగే వార్ ఇది. 2010లో వ...