భారతదేశం, సెప్టెంబర్ 7 -- మమ్ముట్టి.. ఈ పేరు తెలియని సినిమా ఫ్యాన్ ఉండరు. ఈ మలయాళ సూపర్ స్టార్ వయసు పెరుగుతున్నా మరింత జోష్ తో సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన కథలతో చిత్రాలు చేస్తూ ఇప్పటికీ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తున్నారు. ఇండియాలోని అగ్ర నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 7) మమ్ముట్టి బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లోని టాప్ థ్రిల్లర్ మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో 'భ్రమ యుగం' ఒకటి. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ విమర్శకులతోనూ ప్రశంసలు అందుకుంది. మనిషి అత్యాశ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఓ పాత ఇంట్లో నివసించే వ్యక్తి దగ్గరకు ఓ ఫోక్ సింగర్ రావడం, అక్కడ జరిగే పరిణామాలు అదిరిపోయే థ్రిల్ పంచుతాయి. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో అం...