భారతదేశం, నవంబర్ 5 -- ప్రపంచ చలనచిత్ర రంగంలో భారతీయ దర్శకులలో మీరా నాయర్ స్థానం ప్రత్యేకమైనది. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్.. ముంబైలో జన్మించిన స్కాలర్ మహమూద్ మమ్దానీని వివాహం చేసుకున్నారు. కాగా, నవంబర్ 4న వారి కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (34) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో, అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన మీరా నాయర్ మేధస్సు, సృజనాత్మకత ఉట్టిపడే ఆమె అద్భుత చిత్రాలను OTT లో చూసే అవకాశం మీకుంది.

1988లో మీరా నాయర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ముంబై వీధుల్లోని పదేళ్ల బాలకృష్ణ కళ్లల్లోంచి నగరంలో నివసించే వీధి బాలల కఠోర వాస్తవాన్ని చాలా శక్తిమంతంగా, కదిలించేలా చూపించారు.

కథాంశం: తల్లి వదిలేయడంతో ఒక సర్కస్‌లో చేరిన కృష్ణ, ఆ తర్వాత ఒంటరిగా బాంబే చేరుకుంటాడు. తన ఇంటికి తిరిగి వెళ్లడానికి రూ. 500 ప...