భారతదేశం, జనవరి 21 -- మన శంకర వర ప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు అంటూ సంక్రాంతి 2026 బరిలో నిలిచిన చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టారు. జనవరి 12న రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ చిత్రం నుంచి ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాలోని ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్ ను ఇవాళ (జనవరి 21) రిలీజ్ చేశారు మేకర్స్. స్కూల్ లో పీఈటీ టీచర్ గా వెళ్తారు చిరంజీవి. అక్కడ తన పిల్లలను చూసి ఫుల్ ఖుష్ అవుతారు. ఆ సందర్భంలోనే పిల్లలతో కలిసి చిరు చేసే సందడే ఈ ఫ్లైయింగ్ హై సాంగ్.

పెప్పీ బీట్ తో, ఇంగ్లీష్ లిరిక్స్ తో సాగుతున్న ఫ్లైయింగ్ హై పాటను చిరం...