భారతదేశం, జనవరి 24 -- సంక్రాంతి 2026 విన్నర్ మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు భారీ షాక్. ఈ మూవీ కలెక్షన్లపై కోర్టులో కేసు విచారణకు వచ్చింది. పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన వసూళ్లను రికవరీ చేయాలంటూ ఓ వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని హై కోర్టు విచారణకు స్వీకరించింది.

సంక్రాంతి 2026 సందర్భంగా జవనరి 12న థియేటర్లలో రిలీజైంది మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీ ప్రీమియర్స్, టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్రీమియర్, టికెట రేట్ల పెంపుపై హై కోర్టుల ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై న్యాయవాది పాదూరి శ్రీనివాస రెడ్డి కోర్టులో కేసు వేశారు.

చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు లాయర్ ప...