భారతదేశం, జనవరి 12 -- సంక్రాంతి 2026కి వచ్చిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఓ వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. ఈ మూవీలో వెంకటేష్ ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే సినిమా బాగుందని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తూ మెగా అభిమాని మృతి చెందారు. ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్...