భారతదేశం, డిసెంబర్ 4 -- మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాకు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం, ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.

అయితే, తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేశారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎం...