భారతదేశం, డిసెంబర్ 20 -- విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దండోరా'. 'కలర్ ఫొటో', 'బెదురులంక 2012' వంటి మంచి చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని 'దండోరా' మూవీని రూపొందించారు.

ఈ చిత్రంలో బిగ్ బాస్ శివాజీతో పాటుగా న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. దండోరా సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

-'దండోరా' చిత్రంలో బిందు మాధవి గారి పాత్రను...