భారతదేశం, మే 19 -- హైదరాబాద్ నగరం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఏమైనా.. కనీసం సహాయక చర్యలు చేపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం.. ఇరుకు మార్గం. ఒక్కటే మెట్ల మార్గం, అది కూడా ఇరుగ్గా ఉండటంతో.. ప్రాణాలు కాపాడలేకపోయారు. సరిగ్గా ఇదే అంశంపై ఇప్పుడు విజయవాడలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడలోని వన్ టౌన్ ఏరియాలో చాలా ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. శివాలయం వీధి, బిసెంట్ రోడ్, మెయిన్ బజార్.. ఇలా అనేక ప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోతాయి. ఈ ఏరియాల్లో చాలా ఇరుకు వీధులు ఉన్నాయి. ఎదురుగా ట్రాలీ ఆటో వచ్చినా.. బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఈ ప్రాంతాల్లోనే రకరకాల షాపులు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంట...