Hyderabad, ఏప్రిల్ 22 -- మనిషి బతికేది భూమిపైనే. భూమి మనకు ఇచ్చే ఆహారం, నీళ్లతోనే జీవులన్నీ బతుకుతున్నాయి. భూమిని కాపాడుకుంటేనే జీవజాతులు మనగలవు. భూమిని కాపాడుకోవాలన్న అవగాహనను అందరిలో పెంచాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ప్తి ఏడాది వరల్డ్ ఎర్త్ డే నిర్వహించుకోవడం ప్రారంభించాము.

పర్యావరణ పరిరక్షణకు మద్దతును ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం ఎర్త్ డే. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఎర్త్ డే ప్రపంచానికి గుర్తు చేస్తుంది.

ప్రపంచ భూమి దినోత్సవం ఏటా ఏప్రిల్ 22 న వస్తుంది. వరల్డ్ ఎర్త్ డే 2024 థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ . ప్లాస్టిక్ వల్ల భూమిపై కాలుష్య సమస్య తీవ్రంగా మారిపోతోంది. అది ప్రకృతికి ఎంతో హాని కలిగిస్తుంది. దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే థీమ్ లక్ష్యం.

ఎర్త్ డే 2025 కోసం EARTHDAY.ORG భూమి ఆరోగ్యం కోసం ప్లాస...