భారతదేశం, డిసెంబర్ 29 -- ది రాజా సాబ్ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్స్ లో చూపిస్తూ సాగింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోతున్న సునామీకి ఈ ట్రైలర్ మరింత దోహదం చేయనుంది.

ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. "ది రాజా సాబ్ ట్రైలర్ 2.0.. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువే. పర్ఫార్మెన్సెస్, విజువల్స్, మ్యూజిక్.. అన్నీ కలిసి ఓ అద్భుతమైన అనుభవాన్ని ఈ సంక్రాంతికి అందించనుంది. జనవరి 9, 2026న థియేటర్లలో.." అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ట్వీట్ చేసింది.

గతంలో వచ్చిన ట్రైలర్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ మరింత గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, అన్నింటికీ మించి ప్రభాస్ వైలెంట్ లుక్స్ తో మూవీపై మరింత అంచనాలు పెంచేసింది.

ఇక ది రాజ...