భారతదేశం, జనవరి 26 -- టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ మూవీ చాయ్ వాలా. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

చాయ్ వాలా సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల చాయ్ వాలా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ మేరకు నిర్వహించిన చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ మ...