భారతదేశం, డిసెంబర్ 28 -- భారతదేశ సాంప్రదాయ చేతిపనులు, ముఖ్యంగా నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఆర్థిక వృద్ధిని, సామాజిక సాధికారతను ఎలా నడిపిస్తున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మన్‌కీ బాత్‌లో భాగంగా నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. లేస్ క్రాఫ్ట్‌ను "సహనం, సంక్లిష్టమైన కళాత్మకతకు చిహ్నం"గా ప్రశంసించారు.

తరతరాలుగా మహిళా చేతివృత్తులవారు అంకితభావంతో లేస్ ఉత్పత్తుల వారసత్వాన్ని నిలబెట్టుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ మద్దతుతో నైపుణ్య శిక్షణను అందిస్తోందన్నారు. నరసాపురం లేస్ ఉత్పత్తులు కొత్త డిజైన్లను పరిచయం చేస్తోందన్నారు. మార్కెట్ సంబంధాలను మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు.

నరసాపురం లేస్ పరిశ్రమ గణనీయమైన మైలురాళ్లను సాధించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వాట...