భారతదేశం, నవంబర్ 6 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన మరవకముందే తెలంగాణలో ఆర్టీసీ బస్సుపై కంకర లోడు పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన జరిగింది. ఆ తర్వాత చిన్న చిన్న రోడ్డు ప్రమాద వార్తలు తరచూగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రోడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.

విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు కాలిపోయింది. ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌లో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు ఆపేశారు. వెంటనే ప్రయాణికులు దిగిపోవాలని చెప్పారు. ఈ సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన...