Andhrapradesh,Parvathipuram Manyam, జూలై 19 -- వర్షాకాలం రావటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ జ్వరాలతో చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డులు కిక్కిరిసిపోతున్నాయి.

రోగుల తాకిడి పెరుగుతుండడంతో పలు ప్రభుత్వ ఆస్పత్రులు సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురు రోగులు చికిత్స పొందుతుండటంతో పరిశుభ్రత, నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మన్యం జిల్లా మొత్తం కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్ల విద్యార్థుల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర జ్వరంతో చేరిన పలువురు చిన్నారులకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.

సాలూరు ఏరియా ప్రభుత్వాసుపత్రిని 10...