భారతదేశం, జూలై 17 -- మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీట్) దాఖలు చేసింది. 56 ఏళ్ల రాబర్ట్ వాద్రాపై ఒక క్రిమినల్ కేసులో ఒక దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. హర్యానాలోని మనేసర్-షికోపూర్ (ప్రస్తుతం సెక్టార్ 83)లో వివాదాస్పద భూ దందా కేసుకు సంబంధించిన ఈ చార్జిషీట్ లో పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు కూడా ఉన్నాయి.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద రాబర్ట్ వాద్రాతో పాటు మరికొందరిపై స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రూ.37.6 కోట్ల విలువైన 43 ఆస్త...