Hyderabad, అక్టోబర్ 4 -- పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయశంకర్. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ జయ శంకర్ ఏడేళ్ల తర్వాత దర్శకుడిగా వస్తున్న సరికొత్త సినిమా అరి. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మనిషిలోని కోరికల ఆధారంగా తెరకెక్కిన అరి మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అరి సినిమా కోసం డైరెక్టర్ జయశంకర్ చేసిన పరిశోధన ఆయన డెడికేషన్‌ ఎలా ఉందో చెబుతోంది. స్నేహితులు, బంధాలు అన్నింటికి దూరంగా అదృశ్యమయి ఏడేళ్లపాటు హిమాలయాల్లో ఉండి అరి కోసం కష్టపడ్డారు జయశంకర్.

'పేపర్ బాయ్' తర్వాత చేసే చిత్రం కూడా అంతే స్థాయిలో ఉండాలని, అలానే ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలని జయ శంకర్ అనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా ...