భారతదేశం, జూలై 5 -- సినిమా పాటలు చాలా రకాలు. కొన్ని అర్థం కావు. మరికొన్ని లిరిక్స్ వినిపించకుండానే డీజే మోతలతో ఉంటాయి. కానీ కొన్ని పాటలు మాత్రం మనసును హత్తుకుంటాయి. లోపలికి చొచ్చుకెళ్లిపోతాయి. ఏ పని చేసినా అవే గుర్తుకు వస్తాయి. ఆ పాటల్లోని పదాలు మనల్ని వెంటాడుతాయి. రీసెంట్ గా వచ్చిన కుబేర సినిమాలోని 'నా కొడుకా' పాట కూడా ఇలాంటిదే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని నా కొడుకా పాట పాపులర్ అయింది. లోకం తీరు ఎలా ఉందో తన కొడుక్కి చెప్పే అమ్మ పాటగా ఇది సాగుతుంది. నంద కిశోర్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. సిందూరి విశాల్ ఎంతో చక్కగా పాడారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

పచ్చ పచ్చని చెలల...