భారతదేశం, ఆగస్టు 6 -- ఈటీవీ విన్ ఓటీటీ వారం వారం కొత్త షార్ట్ ఫిల్మ్స్ తో డిజిటల్ ఆడియన్స్ ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. లవ్, ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలు ప్రతి ఆదివారం అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరో హార్ట్ టచింగ్ స్టోరీ ఈటీవీ విన్ లోకి వచ్చేస్తోంది. లవ్ స్టోరీగా ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది.

కథా సుధ పేరుతో ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ ఫిల్మ్ ను ఆడియన్స్ కు అందిస్తుంది. వచ్చే ఆదివారం (ఆగస్టు 10) మరో కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. 'దొరికిన ప్రేమలేఖ' అంటూ ఈటీవీ విన్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ ఫిల్మ్ వస్తుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

''ఒక లేఖ.. అంతులేని భావోద్వేగాలు. అన్నింటినీ మార్చే మాటలు, ప్రేమ, దూరం కలగలిసిన కథ. కథా సుధ నుంచి దొరికిన ప్రేమల...