భారతదేశం, సెప్టెంబర్ 8 -- మలయాళం సినిమాలు అంటేనే ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా కరోనా టైమ్ లో ఓటీటీ పుణ్యమా అని తెలుగు వాళ్లు కూడా మలయాళం సినిమా లవ్ లో పడిపోయారు. ఇప్పుడు కొత్త సినిమా ఏది డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినా వదలకుండా చూస్తున్నారు. అలాంటి హార్ట్ టచింగ్ మలయాళం సినిమాలు కొన్ని ఓటీటీలో ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన ఈ మలయాళం మూవీస్ కొన్ని ఇక్కడున్నాయి.

ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉన్న మలయాళ ఎమోషనల్ డ్రామా 'కుంబలంగి నైట్స్'. విడిపోయిన నలుగురు సోదరులు తిరిగి ఫ్యామిలీగా కలుసుకోవడమే సినిమా కథ. కుటుంబ సంబంధాలు, ప్రేమ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. కచ్చితంగా మనసును తాకే మూవీ ఇది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఓటీటీ ఆడియన్స్ కు ఇది అందుబాటులో ఉంది.

ఇండియాలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లు అనగానే ఠక్కున దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది. ఇది క్రైమ్ థ్ర...