Hyderabad, మే 6 -- ఒక పెద్ద నగరంలో ఒక వ్యాపారవేత్త కుటుంబంతో నివసిస్తున్నాడు. ఖరీదైన బట్టలు, విలాసవంతమైన బంగ్లా, ఇంట్లో పదిమంది పని మనుషులు, బంగారం, డబ్బు... అతనికి అన్నీ ఉన్నాయి. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి వెతుకుతూనే ఉంటుంది. ఆ వెతుకులాట మనశాంతి కోసమే. ఆ మనస్శాంతి దొరకక ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చేవాడు.

నిరంతరం వ్యాపార పర్యటనలు, వ్యాపార పోటీ, లాభనష్టాలు, బిజీ జీవితం.. అతనిని మానసికంగా కుంగిపోయేలాగా, అలసిపోయేలాగా చేశాయి. జీవితంలో అన్నీ ఉన్న అసంపూర్ణంగా అనిపించేది. తనకు కావాల్సింది ఇంకా ఏదో ఉందని అతను అనుకునేవాడు. తన జీవితంలో అసంపూర్ణత ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలని తపించిపోయేవాడు.

ఒకరోజు గ్రామంలో నుంచి వెళుతూ ఉండగా ఊరి చివరన అతనికి ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలో ఒక సాధువు ప్రశాంతమైన చిత్తంతో ధ్యానం చేసుకుంటూ కనిపించ...