Hyderabad, ఆగస్టు 22 -- ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీగా ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో వస్తున్న సినిమా రామాయణ (Ramayana). దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీపై ఇప్పుడు నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇది ప్రపంచంలో ఉన్న అందరికీ నచ్చితేనే సక్సెస్ సాధించినట్లు భావిస్తానని అన్నాడు.

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రామాయణ' మూవీ.. ఇప్పటివరకు భారతదేశంలో నిర్మించిన చిత్రాల్లో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కు చెందిన నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ రెండు భాగాల ఇతిహాసానికి మొత్తం కలిపి రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికతతో.. ఈ ఇతిహాసాన్ని అంతర్జాతీయ సినిమాగా ...