భారతదేశం, డిసెంబర్ 19 -- సాధారణంగా క్యాన్సర్ అనగానే మనకు ఆసుపత్రులు, స్కానింగ్‌లు, సర్జరీలు గుర్తుకు వస్తాయి. కానీ, ఆ స్థాయికి వెళ్లకముందే మన దైనందిన అలవాట్లు, ముఖ్యంగా మనం రోజూ ప్లేటులో వడ్డించుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా శాసిస్తుంటుంది. మనం తీసుకునే ఆహారం శరీరంలోని వాపు (Inflammation), జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యత, కణాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

"ఏ ఆహారమూ నేరుగా క్యాన్సర్ కలిగించదు. కానీ కొన్ని రకాల పదార్థాలను, రసాయనాలు కలిగిన ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది" అని ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అర్పిత్ బన్సాల్ హెచ్చరిస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

క్యాన్సర్ ముప్పును పెంచే 7 ఆహార పదార్థాలు:

"సాసేజ్‌లు, బేకన్, ...