Hyderabad, మే 15 -- భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 'వసుధైవ కుటుంబకం' అంటే యావత్ ప్రపంచమే ఒక కుటుంబం అని మన సంస్కృతి చాటుతుంది. మనం ఎంత ఎదిగినా, మన మూలాలను, మన చరిత్రను, ముఖ్యంగా మన కుటుంబాన్ని ఎప్పటికీ మరచిపోకూడదని పెద్దలు చెబుతారు. వ్యక్తి ఉంటేనే కుటుంబం, కుటుంబాలు కలిసి ఉంటేనే సమాజం ఏర్పడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి.

కుటుంబం మన అస్తిత్వం. కష్టకాలంలో ప్రపంచం మొత్తం మనకు దూరమైనా, కుటుంబం మాత్రం వెన్నంటే ఉంటుంది. ఇది ఒకప్పటి మాటలా అనిపించినా, నేటి సమాజంలో కూడా కుటుంబానికి దానికి ప్రత్యేక స్థానం ఉంది. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బాబాయి, పిన్ని, తాతయ్య, నాయనమ్మ, మామయ్య, అత్తయ్య ఇలా అనేక బంధాలతో కలిసి ఉండే కుటుంబాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక గొప్ప బలాన్నిస్తాయి.

కుటుంబ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప...