భారతదేశం, నవంబర్ 23 -- మధ్యప్రదేశ్‌ రైసెన్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. దివ్యాంగుడైన ఒక వ్యక్తిపై అతని సొంత బంధువులే దాడి చేశారు. అనంతరం అత్యంత హేయంగా అతనిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. స్థానికులు ఆ ఆకృత్యాన్ని ఫోన్​లతో చిత్రీకరించారు కానీ జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం!

వీడియో వైరల్‌ అయిన తరువాత ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి, నిందితులు రాజ్‌కుమార్ లోవంశీ, గోవింద్ లోవంశీ లను అరెస్టు చేశారు.

నిందితులతో పాటు బాధితుడు కలిసి వడ్లు అమ్మి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది తరువాత కొట్లాటగా మారింది. బాధితుడు కిందపడిపోగా, నిందితుల్లో ఒకరు అతనిపైకి ఎక్కి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. మరొక వ్యక్తి అతన...