భారతదేశం, జనవరి 29 -- వన్యప్రాణుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ కీలక అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ కింద ఉన్న నల్లమల అడవులలో అంతరించిపోతున్న అడవి దున్న (ఇండియన్ గౌర్) తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు ఓకే అయితే దాదాపు 160 సంవత్సరాల కిందట నల్లమలలో సందడి చేసిన అడవి దున్నలు మళ్లీ తిరగనున్నాయి. నల్లమల ప్రాంతానికి ఈ గంభీరమైన జాతి తిరిగి వస్తే ఆకర్శణగా ఉండనుంది. జీవవైవిధ్యానికి పుట్టినిల్లు నల్లమల. ఇటీవల దట్టమైన నల్లమల అడవులలో ఒంటరి మగ అడవి దున్న చూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జూలై 2024లో నంద్యాల జిల్లాలోని ఆత్మకూర్ నల్లమల అటవీ విభాగంలో ఈ జంతువు నాలుగు నుండి ఆరు సార్లు కనిపించింది. జూలై, అక్టోబర్ 2024 మధ్య సాధారణ పర్యవేక్షణలో బైర్లూటి, ...