భారతదేశం, నవంబర్ 23 -- మధుమేహం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధుమేహం అందరిని ఇబ్బంది పెడుతోంది. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మెయిన్​టైన్​ చేయలేకపోతుంటారు. అందుకే ఆహారాన్ని ఆస్వాదిస్తూనే, గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి పరిష్కారాల కోసం చూస్తుంటారు. ఈ సమస్యకు మీరు బహుశా ఆలోచించని ఒక అద్భుతమైన మార్గం మెంతి గింజల నీరు! ఈ సాధారణ పానీయం మీ రోజువారీ ఆహారంలో నిజమైన మార్పును తీసుకురాగలదు. ముఖ్యంగా ఉదయం పరగడుపున తాగితే మరీ మంచిది.

సాంప్రదాయ వైద్యంలో, వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే విలువైన మూలిక వస్తువు మెంతులు. "వీటి గింజల్లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి," అని ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ కిరణ్ దలాల్ తెలిపారు. ఈ లక్షణాల కారణంగా మెంతులు ముఖ్యంగా ర...