భారతదేశం, అక్టోబర్ 27 -- తెలంగాణలో వైన్స్ షాపుల టెండర్ల గురించి ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 27వ తేదీన లక్కీ డ్రా ఉదయం ముదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరంగా కొందరికి మద్యం షాపుల లక్కీ డ్రాలో లక్కు ఎక్కువగా కలిసి వస్తుంది. ఎందుకంటే కొందరు కలిసి టెండర్లు వేశారు. అంటే ఎక్కడ టెండర్ తగిలినా.. దానిలో సమానంగా ఉంటుంది. ఇలా కొంతమంది కలిసి టెండర్లు వేస్తారు. లక్కీ డ్రాలో లైసెన్స్ వస్తే.. అంతా సమానంగా ఉంటారు. అయితే కొందరికి లక్కీ డ్రాలో మూడు షాపులు కూడా కలిసి వచ్చాయి.

సంగారెడ్డిలో కె.వంశీధర్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 100కి పైగా దరఖాస్తులు దాఖలు చేశాడు. పటాన్‌చెరులో మూడు మద్యం దుకాణాల లైసెన్స్‌లను పొందాడు. కేటాయించిన మూడు అవుట్‌లెట్‌లు అతడి పేరు మీదకు రావడంతో ముగ్గురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100కి పైగా దరఖాస్తులు...