భారతదేశం, ఫిబ్రవరి 20 -- మద్యం సేవించడం ఒక అలవాటు మాత్రమే కాదు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? ఒక సంవత్సరం పాటు మద్యం సేవించకుండా ఉంటే ఎంత డబ్బు ఆదా చేయొచ్చో, దానిని పెట్టుబడి పెడితే ఎంత రాబడి పొందొచ్చో, ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఈ కథనంలో చూద్దాం.

రాము, కృష్ణ, గోపి, రవి.. నలుగురు స్నేహితులు. వీరిలో రాము రోజుకు 3 పెగ్గుల మద్యం సేవిస్తాడు. కృష్ణ వారానికి మూడు సార్లు, గోపి వారానికి రెండు సార్లు, రవి వారానికి ఒకసారి 3 పెగ్గుల మద్యం తాగుతారు. ఒక్కో పెగ్గ్ ఖరీదు రూ. 125 అనుకుంటే..

పై లెక్కల ప్రకారం, రాము రూ. 1,35,000, కృష్ణ రూ. 54,000, గోపి రూ. 36,000, రవి రూ. 18,000 ఒక సంవత్సరంలో ఆదా చేస్తారు.

ఈ మొత్తాన్ని 12% రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెడితే ఎవరు ఎంత సంపాదించగలరో చూడండి. ...