భారతదేశం, ఏప్రిల్ 19 -- ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. వైసీపీలో కీలక నేతలపై ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతోంది. శనివారం ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడ సిట్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను దాదాపు 8 గంటల పాటు సిట్‌ బృందం విచారించింది. మిథున్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, సంతకాలు తీసుకుంది. మద్యం కుంభకోణంలో వివిధ అంశాలపై ఆరా తీసిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశముంది. కోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలోనే సిట్ మిథున్‌రెడ్డిని విచారించింది.

లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్‌ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై మిథున...