భారతదేశం, జూన్ 30 -- మద్యం కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులను పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. జులై 1 నుంచి 3వ తేదీ వరకు కస్టడీ విధించింది. పోలీసులు వీరిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయనున్నారు.

ఇంకోవైపు ఈ కేసులో వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడును ఇటీవల సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు రిమాండ్ విధించింది. తాజాగా పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.

మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ వేడిని పెంచుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకున్నది. ఎలక్షన్ సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి రూ.8కోట్ల 20 లక్షల రూపాయల...