భారతదేశం, జనవరి 21 -- అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అధికంగా మద్యం సేవించి మృతిచెందారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మద్యంతోపాటుగా మరో కారణం కూడా వారు మృతిచెందడానికి కారణమైంది. అధికంగా మద్యం సేవించడం, అతిగా ఆహారం తినడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందడానికి కారణం అని పోలీసు అధికారి తెలిపారు.

మరణించిన మణి కుమార్ (35), పుష్పరాజ్ (27) జనవరి 17న అదే గ్రామానికి చెందిన తమ నలుగురు స్నేహితులను కలుసుకుని చాలా గంటలపాటు కలిసి బీర్లు తాగారు. 'అన్నమయ్య జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత ఆహారం ఎక్కువగా తినడం కారణంగా మరణించారు.' అని రాయచోటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) కృష్ణ మోహన్ పీటీఐకి తెలిపారు.

నలుగురు స్నేహితులు 19 బీర్ సీసాలను కొనుగోలు చేసి మధ్యాహ్నం 3.30 నుంచి రా...