భారతదేశం, నవంబర్ 10 -- బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడానికి తాజా వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, రేపిస్టులు వంటి ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టీవీలు చూస్తున్న వీడియోలు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జైలు నుంచే మరో వీడియో బయటికొచ్చింది.

ఈ వీడియోలో ఖైదీలు మద్యం, స్నాక్స్‌లతో విందు చేసుకుంటూ, ఒకరితో ఒకరు నృత్యం చేస్తూ విలాసవంతమైన పార్టీ చేసుకున్న దృశ్యాలు కనిపించాయి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. డిస్పోజబుల్ గ్లాసులలో మద్యం, వాటి పక్కనే ప్లేట్లలో కట్ చేసిన పండ్లు, వేయించిన పల్లీలు (స్నాక్స్) చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాయి. చూస్తే, ఇదొక సాధారణ పార్టీలా కనిపించింది. వీడియోలో వరుసగా నాలుగు చిన్న మద్యం సీసాలు పెట్టడం కనిపించింది. కొంతమంది ఖైదీలు పాత్ర...