భారతదేశం, ఏప్రిల్ 26 -- దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29 శాతం ఏపీ నుంచే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో సీఎం భేటీ అయ్యారు. సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న సీఎం...చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం వెన...