భారతదేశం, మే 2 -- కులం పేరుతో పాస్టర్‌ను దూషించిన కేసులో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారుడు స్వయంగా క్రైస్తవ మతంలోకి మారినట్టు స్పష్టం చేసినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని, మతం మారిన రోజే.. ఎస్సీ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఆదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై చందోలు పోలీసులు 2021 జనవరి 26న ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై రామిరెడ్డి, ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో పిటిషనర్ల ...