భారతదేశం, ఆగస్టు 28 -- తలైవా రజనీకాంత్ రికార్డుల వేట కొనసాగిస్తారు. ఆయన లేటెస్ట్ మూవీ 'కూలీ' కలెక్షన్లతో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2తో పోటీ పడిన ఈ చిత్రం ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెడుతోంది. కలెక్షన్లు తగ్గినా స్థిరంగా సాగిపోతుంది కూలీ.

కూలీ సినిమా కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా 13వ రోజున ఇండియాలో రూ.4.50 కోట్ల నెట్ వసూలు చేయగా.. 14వ రోజు (ఆగస్టు 27) రూ.3.85 కోట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో ఇండియాలో ఈ మూవీ నెట్ కలెక్షన్లు రూ.268.75 కోట్లకు చేరాయి. 14 రోజుల్లో కూలీ మూవీ ఇండియాలో సాధించిన నెట్ వసూళ్లు ఇవి. ఈ చిత్రం రూ.300 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తం...