Hyderabad, మే 22 -- కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు, కొందరు నటీనటులు ఏళ్లు, దశాబ్దాలు గడుస్తున్నా ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటారు. అలాంటి వాళ్లే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కవల పిల్లలు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇప్పటి ముంబైలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మణిరత్నం తీసిన బాంబే మూవీలో ఈ పిల్లలు నటించారు. హృదయ్‌రాజ్, హర్ష అనే ఈ ఇద్దరు ఇప్పుడేం చేస్తున్నారు? చూద్దాం పదండి.

బాంబే మూవీ 1995లో రిలీజైంది. అంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట వచ్చిన సినిమా ఇది. ఆ మూవీ రిలీజ్ సమయానికి ఎనిమిదేళ్ల వయసు ఉంటుంది ఈ కవలలకి. క్యూట్ లుక్స్ తోనే కాదు తమ నటనతో వీళ్లు ఆకట్టుకున్నారు. వీళ్లు మన తెలుగు వాళ్లే. వీళ్లలో ఒకరి పేరు హృదయ్‌రాజ్ కాగా.. మరొకరు హర్ష. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు వీళ్లు. ఆ సినిమాలో కమల్ బషీర్, కబీర్ నారాయణ పాత్రలు పోషించారు. అరవింద్ స్వామి,...