Hyderabad, మే 11 -- వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు వేడి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు మజ్జిగ శరీరానికి అవసరమైన ఎలక్ట్రో లైట్లను అందిస్తుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.ఇందులో ఉండే కాల్షియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న మజ్జిగ రోజూ ఒకే రుచిలో ఏం తింటాం. ఈసారి కొత్తగా చారులా ట్రై చేయండి. ఇక్కడున్న రెసిపీతో ట్రై చేశారంటే మీ మజ్జిగకు ఫ్యాన్స్ అవుతారు. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం రండి.

వేసవిలో ఈ మండే ఎండల మధ్య మజ్జిక చారుతో ముద్ద తిన్నా...