Hyderabad, మార్చి 10 -- వేసవికాలంలో శరీరానికి చలువ చేసే ఆహారాలను తినాలి. అందులో ముఖ్యమైనది మజ్జిగ. పొట్టను చల్లబరిచి జీర్ణ క్రియను మెరుగుపరిచే ఆహారం ఇది. మీరు ప్రతిరోజూ వేసవిలో పుదీనా మజ్జిగ తాగితే ఎంతో ఆరోగ్యం. పుదీనా మజ్జిగలో, ఇంగువను చిటికెడు కలిపి వేసుకొని తాగితే ఇంకా మంచిది. గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

పుదీనా మజ్జిగ కోసం ఇంట్లో ఉన్న పెరుగుతోనే మజ్జిగను చిలకండి. ఒక గ్లాసులో ఆ మజ్జిగను వేసి గుప్పెడు పుదీనా ఆకులు, మిక్సీలో రుబ్బి వాటిని కూడా వేయండి. పుదీనాతో పాటు ఒక పచ్చిమిరపకాయను కూడా వేసి రుబ్బితే రుచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒక స్పూను ఆవాల నూనె వేయండి. ఆ నూనెలో జీలకర్ర ఇంగువ వేసి వేయించి ఈ మజ్జిగలో కలిపేయండి. ఇది బాగా చల్లబడ్డాక దాన్ని తాగేందుకు ప్రయత్నించండి. ఇది పొట్టలోని వేడ...